ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ పనులు గత కొన్ని రోజులుగా నిలిచిపోయాయని అందరికీ తెలుసు. దీనికి ప్రధాన కారణమైన ఇసుక కొరతను తీర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు మొదలవడంతో ముఖ్యమంత్రి ఇసుక అంశం మీద కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ కొన్ని రోజులు రాష్ట్రంలోని ఇసుక కొరతను తీర్చేవిదంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదని అధికార్లకు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఇసుక వారోత్సవాలు – సీఎం జగన్

ఇదిలా ఉండగా జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం లో భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రజా పోరాట యాత్ర ద్వారా ప్రభుత్వానికి కార్మికుల యొక్క గోడును తెలియచేయాలని భావించారు. అలాగే టీడీపీ కి సంబంధించి కొంతమంది నాయకులు కూడా పార్టీ తరుపున రాష్ట్రమంతటా ర్యాలీలు చేసి ఇసుక కొరత యొక్క సమస్యను తీవ్ర స్థాయికి తీసుకుపోయే ప్రయత్నంలో వున్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ త్వరలో వీరందరికీ చెక్ పెట్టి ఇసుక సమస్య లేకుండా చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకునే విధానం
అసలు ఇసుక సమస్య ఎక్కడ మొదలైంది?
- గత ప్రభుత్వం లోని ఉచిత ఇసుక సరఫరా వలన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి
- దళారులు, మధ్యవర్తులు, అడ్డగోలు తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కొత్తగా వచ్చిన ప్రభత్వం భావించింది.
- అందుకు తగట్టుగా ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇసుక విధానాన్ని తీసుకు వచ్చింది.
- దీని ద్వారా ఎవరైనా ఇసుక కావాలనుకున్న వారు నేరుగా ప్రభుత్వానికి సంబందించిన వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకుని ఇసుక పొందవచ్చు.
- ఈ విధానం ద్వారా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వారు 2 నుంచి 3 రోజులలో కావాల్సిన ఇసుకను పొందగలరు
- ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదైనా, వెనువెంటనే వచ్చిన వరదలు అడ్డంకిగా మారాయి.
- ఈ క్రమంలో ఇసుక ఆశించినంత ప్రభుత్వ యార్డులకు తీసుకుని రాలేకపోయారు.
- 267 రీచ్ లు ఉంటే వరదల వల్ల 69 చోట్లకు మించి ఇసుక తీయలేకపోతున్నామని సీఎం పేర్కొన్నారు
- దీని ద్వారా రాష్టంలో చాలా చోట్ల భవన నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి.
- ఇది గమనించిన కమ్యూనిస్ట్ పార్టీలు, టీడీపీ, జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా క్షేత్రం లోకి వచ్చి పోరాట యాత్రలు చేయటానికి శ్రీకారం చుట్టాయి.
- ఇందులో భాగంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 4వ తారీఖున వైజాగ్ లో ప్రజా క్షేత్రం లోకి వచ్చి తన గళాన్ని వినిపించనున్నారు.
- అయితే వరద ఉదృతి క్రమంగా తగ్గటంతో సాధ్యమయినంత వరకు ఇసుక తవ్వకాలు మొదలుపెట్టి ప్రభుత్వ యార్డులకు ఇసుకను సరఫరా చేయాలని సీఎం జగన్ గారు అధికారులకు ఆదేశించారు.
- అలాగే జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దోచేసిన ఇసుక స్థానంలో వర్షాలు, వరదల వల్ల కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదే అన్నారు
- గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక కార్మికులకు పనులు కల్పించాలని సీఎం ఆదేశించారు
- వరదలు పూర్తిగా తగ్గిన వెంటనే ఇసుక వారోత్సవాలు జరపాలని సూచించారు
- దీని ద్వారా ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నట్టు అయింది