ఫేస్‌బుక్‌లో బన్నీ, ట్విట్టర్‌లో మహేష్, ఇన్‌స్టా‌లో విజయ్: సౌత్ ఇండియాలో నెం.1

టాలీవుడ్: సౌత్ ఇండియా పరంగా చూస్తే సోషల్ మీడియాలో తెలుగు నటులకున్న ఫాలోయింగ్ మరే ఇతర భాషా నటులకు లేదనే చెప్పాలి. అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్, విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్స్ కు పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. పైగా వీరి సినిమాలకు ఉత్తరాదిలో మంచి గిరాకీ కూడా. ఈ పాపులారిటీ వల్ల ఇతర రాష్ట్రాల ఫ్యాన్స్ వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అనుచరిస్తూ వుంటారు. దీనితో మనోళ్ల సోషల్ మీడియా ఫాలోవర్లు మిలియన్లలో వున్నారు.

bunny-on-facebook-mahesh-on-twitter-and-vijay-on-instagram-telugu-heroes-followers-on-social-media

సోషల్ మీడియాలో తిరుగులేని స్టార్ ఎవరంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మంచి ఫాలోయింగ్ వుంది. అయితే ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ కు ఒక కోటీ ముప్పై లక్షలకు పైగా ఫాలోవర్లు వున్నారు. తెలుగు నటులలో బన్నీకే పెద్ద నంబరు.

ఇకపోతే ట్విట్టర్‌లో మహేష్ బాబు ముందంజలో వున్నారు. మహేష్ బాబు ఈ మధ్యనే కోటి ఫాలోవర్లను అందిపుచ్చుకున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల ఫాలోయర్స్‌ను సంపాదించుకొని సౌత్‌లోనే నంబర్‌ వన్‌ హీరోగా నిలిచారు. ఈ ముగ్గురవి సౌత్ ఇండియాలోనే నంబర్‌ వన్ సోషల్ మీడియా అకౌంట్లు.

Leave a Comment