లేడీస్ నాట్ అలోవ్డ్ సాయి రామ్ దాసరి దర్శకత్వంలో నటి షకీలా సమర్పించిన అడల్ట్ కామెడీ-హర్రర్ చిత్రం. రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఇది పూర్తి స్థాయి కామెడీ చిత్రం.
లేడీస్ నాట్ అలోవ్డ్ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో డైరెక్టర్ సాయిరామ్ ఢిల్లీ సెన్సార్ బోర్డు వరకు వెళ్లారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. దీంతో సినిమాను నేరుగా వెబ్సైటు ద్వారా విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది. అయితే రానున్న రోజుల్లో ఓటీటీలకు కూడా సెన్సార్ ఉండబోతోందని ఈ మధ్యనే మనం వార్తలు చూసాం.
ఏదేమైనా లేడీస్ నాట్ అలోవ్డ్ సినిమా చూడటానికి ప్రేక్షకులు రూ .50 చెల్లించాలి. ఈ చిత్రం జూలై 20 న రాత్రి 8 గంటలకు విడుదల కానుంది. దర్శకుడు సాయి రామ్ దాసరి మాట్లాడుతూ ఈ వారం సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని అన్నారు.
You May Also Like To Visit: