టాలీవుడ్‌లో తొలి కోవిడ్ మరణం: నిర్మాత పోకూరి రామారావు కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత, ‘ఈతరం ప్రొడక్షన్స్’ అధినేత పోకురి బాబు రావు సోదరుడు పోకురి రామారావు కరోనావైరస్ కారణంగా మరణించారని తాజా నివేదికలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రామారావు గారికి కరోనావైరస్ పాజిటివ్  అని తేలింది, దీనికి గాను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే పరిస్థితి మరింత దిగజారి శనివారం ఉదయం 9 గంటలకు రామారావు తుది శ్వాస విడిచారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

telugu-producer-dies-of-covid

కరోనావైరస్ ద్వారా మరణించిన మొదటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తి రామారావు. ప్రస్తుతం పోకూరి రామారావు గారి వయసు 64 సంవత్సరాలు. కొరోనా వైరస్ టాలీవుడ్ ను ఇప్పుడప్పుడే వదిలి పెట్టేలా లేదు. కరోనా బారీన పడిన తెలుగు నటుల సంఖ్య  5 దాటింది.

Leave a Comment