సురేష్ ప్రొడక్షన్స్&నిర్మించిన Krishna And His Leela అనే తెలుగు సినిమా త్వరలో డిజిటల్ platform పైకి రానుంది. ఈ సినిమాకి రానా దగ్గుబాటి సమర్పుకులు. సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాధ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. అందుతున్న వార్తల ప్రకారం, ఈ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ వేదిక పైకి రిలీజ్ చేయనున్నారు. అయితే దీనికి సంబందించిన వార్త అధికారకంగా ద్రువీకరించబడలేదు. కానీ రానా మాత్రం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా అతి త్వరలో రానుందని హింట్ ఇచ్చారు.
ఇంటర్నెట్ లో ఈ సినిమాకు విడుదలకు సంబంధించి ఒక వార్త మాత్రం బాగా హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాను Netflix లో రిలీజ్ చేయనున్నారని. కానీ విడుదల తేదీ మాత్రం ఇంకా బయటకు రాలేదు.
కృష్ణ అండ్ హిస్ లీల తో పాటుగా నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ సినిమా కూడా ఓటీటీపైకి రానుంది. ఈ రకంగా చూస్తే డిజిటల్ platform లో మరిన్ని చిన్న సినిమాలు విడుదల అవుతాయని తెలుస్తుంది.
భానుమతి రామకృష్ణ జులై 30కి ఆహా వీడియో లోకి అందుబాటులోకి వస్తుంది. అయితే కృష్ణ అండ్ హిస్ లీల Netflix లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది, రిలీజ్ డేట్ తెలియాల్సి వుంది.