తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరోనా భయం!

తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు సడలింపులు ఇస్తూ కొన్ని నిబందనలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ నిబంధనల ప్రకారం, అనగా తగిన జగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు చేసుకోవచ్చని చెప్పింది. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిన్న సినిమాల షూటింగులు మొదలయ్యాయి, అందులో రవిబాబు క్రష్ సినిమా ఒకటి.

కానీ యే ఒక్క పెద్ద సినిమా కూడా ఇప్పటి వరకు మొదలవ్వలేదు. సడలింపులు ఇచ్చినా మన  పెద్ద స్టార్స్ షూటింగ్స్ కి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. దీనికి పెద్ద కారణమే వుంది. పెద్ద సినిమాల సెట్స్ లో రోజుకు వందల సంఖ్యలో జనాభా పనిచేయవలసి వస్తుంది. ప్రస్తుతం చూస్తే కరోనా భరత్ లో విలయతాండవం చేస్తుంది. మొన్నటి వరకు ఊళ్ళల్లో లేని కరోనా ఇప్పుడు పల్లెటూర్లకు కూడా పాకేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సంఖ్యలో ఆర్టిస్టులు, వర్కర్స్ ని పెట్టి షూటింగులు చేయటం కష్టంతో కూడుకున్న పని.

corona-fear-for-tollywood
Super Star Mahesh Babu in SVSC shooting spot (Old Pic)

మరోవైపు కరోనా సినిమా వాళ్ళని కూడా వదల్లేదు. మొన్ననే బండ్ల గణేష్ కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే టీవీ నటుడు ప్రభాకర్ (జూనియర్) కి కూడా కరోనా పోజిటివ్ అని తేలింది. అందుకే మన పెద్ద స్టార్స్ అందరూ ఇంకొక 2 నెలలు వెనక్కి వెళితే మంచిదని అనుకుంటున్నారట.

Read More News: Telugu Movie Updates

Leave a Comment