రవితేజ, రానా అయ్యప్పన్ కోషియుమ్ తెలుగు రీమేక్ డైరెక్టర్ సాగర్ చంద్రా!

చాలా నెలల నుంచి సాగుతున్న అయ్యప్పన్ కోషియుమ్ తెలుగు రీమేక్ సంగతి ఎట్టకేలకు పట్టాలు ఎక్కనుంది. మొదట ఈ సినిమాని తెలుగులో బాలకృష్ణ, రానా తో తీయాలనుకున్నా బాలయ్య డేట్స్ దొరక్కపోవటం వల్ల రవితేజని తీసుకోవటం జరిగింది. మలయాళంలో అయ్యప్పన్ కోశియుమ్ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాలో బిజూ మీనన్, ప్రిథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేయటం జరిగింది. పైగా ఇద్దరికీ యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడ్డాయి.

ayyappanum-koshiyum-rana-raviteja

మళయాళ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాలో పృథ్వీరాజ్ రోల్ కు రానా కరెక్ట్ గా సరిపోతాడని చెప్తున్నారు. బిజూ మీనన్ రోల్ కు సరితూగే యాక్టర్ ను తెలుగులో చూస్తే బాలయ్యే కనపడతాడు. కానీ ఈ కాంబినేషన్ ను సెట్ చేయలేకపోయారు. దీనికి కారణం బాలయ్య బోయపాటి సినిమా డేట్స్ ఫిక్స్ అవ్వటం.

ఇప్పుడు బాలయ్య స్థానంలో ఇండస్ట్రీ లో వున్న మరో సీనియర్ నటుడు రవితేజ. రవితేజకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందో లేదో సినిమా చూశాకే చెప్పగలం. అయితే మొన్నటి వరకు ఈ తెలుగు రీమేక్ డైరెక్టర్ కోసం వెతుకుతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సాగర్ చంద్రా ని confirm చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సాగర్ చంద్ర చివరి సినిమా ఒకడుండేవాడు డైరెక్టర్.
Read: aha Video Upcoming Telugu Movies

Leave a Comment