2017లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని థియేటర్స్ లో ఒక్క షో కూడా పడకుండా ఆగిపోయిన ఆరడుగుల బులెట్ సినిమా మళ్ళీ తెరపైకి రానుంది. తాజా సమాచారం ప్రకారం ఆరడుగుల బులెట్ సినిమాని డిజిటల్ ప్రేక్షకులకు అందించనున్నారు. దీనికి సంబందించి సినిమా మేకర్స్ OTT యాజమాన్యాలను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్, నయనతార కలయికలో వస్తున్న మొదటి సినిమా. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించగా బి గోపాల్ దర్శకత్వం అందించటం జరిగింది, తాండ్ర రమేష్ నిర్మాత. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే అందుబాటులో వున్నాయి. కాగా 2017 మే నెలలో రిలీజ్ చేయాలనుకుని, కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల సినిమాను రిలీజ్ చేయలేకపోయారు.
ఇప్పటి పరిస్థితుల్లో ఈ సినిమాను డిజిటల్ వేదిక పై డైరెక్ట్ రిలీజ్ చేయటానికి నిర్మాతలు సన్నద్ధం అవుతున్నారని వినికిడి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియవలసి వుంది. ఈ వార్త నిజం అయితే, తెలుగులో పెద్ద హీరో నుంచి OTTకి వస్తున్న మొదటి సినిమా ఆరడుగుల బుల్లెట్.