జులై నెలలో థియేటర్స్ ను తిరిగి ప్రారంభినచాలని సినీ పెద్దలు ఆలోచిస్తుంటే, మరో వైపు అసలు సినిమాలు చూడటానికి జనాలు ఈ సంవత్సరం వచ్చేదట్టు వున్నారా! అని మరికొంతమంది ఆలోచిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఇంకో రెండు మూడు నెలలు జనసాంద్రత ఎక్కువగా వుండే ప్రదేశాలను మూసివేయటం ఎంతైనా మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయం లో సినిమా హాళ్లు మొదటి స్థానంలోఉంటాయి. కాబట్టి సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభించే రోజు ఇంకా కొన్ని నెలలు పొడిగించటం ఎంతైనా మంచిది. ఒక వేల తిరిగి ప్రారంభించినా థియేటర్స్ లో కరోనా పరీక్షలు చేయాల్సిందే. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని పైగా రోజుకు వేళ సంఖ్యలో పరీక్షలు చేయాల్సి వస్తుంది. వీర అభిమానుల సంగతి పక్కన పెడితే మరికొంత కాలం డిజిటల్ వేదికలకే పరిమితం అయితే మంచిదని జనాలు భావిస్తున్నారు.


ఏదేమైనా కరోనా పోయాక థియేటర్స్ కు జనాలు రావాలీ అంటే ఎదో ఒక పెద్ద సినిమా టాలీవుడ్ ను ఆదుకోవాల్సిందే. ఎందుకంటే కుర్ర హీరోల సినిమాలు చూడటానికి జనాలు తిరిగి సినిమా థియేటర్స్ కు వస్తారనే నమ్మకం లేదు. టాలీవుడ్ లో దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్. రాబోయే రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అయితే గాని మరి కొన్ని సినిమాలు ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేయగలవు.
ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ జులై నెలలో అయినా థియేటర్స్ ఓపెన్ అయితే.. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చూడాలి చివరికి ఏమౌతుందో…!
You May Also Like To Visit: