ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లోని పేర్లు విడుదల చేసిన జాతీయ దర్యాఫ్తు సంస్థ

జాతీయ దర్యాఫ్తు సంస్థ ఇటీవల విడుదల చేసిన ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో వున్న పేర్లను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఉగ్రవాదుల సంస్థ ఈ లిస్ట్ లో కొత్తగా భారత క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ పేరును చేర్చింది. దీనికి సంబందిచిన లేఖను NIA (జాతీయ దర్యాఫ్తు సంస్థ) బీసీసీఐ కు పంపింది. అదే విదంగా రానున్న భారత్ బాంగ్లాదేశ్ మ్యాచ్ కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అరుణ్ జైట్లీ స్టేడియం లో జరగబోయే ఈ మ్యాచ్ లో కోహ్లీ సేనకు భారీ బందోబస్తును మనం గమనించవచ్చు.

virat-kohli-name-terror-threat

ఇదిలా ఉండగా ఇదే టెర్రర్ టార్గెట్ జాబితా లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్,  రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, అద్వానీ, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి 12 మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్లు జాతీయ దర్యాఫ్తు సంస్థకు సమాచారం అందింది. ఈ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ కాగా చివరి పేరు భారత క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీది.

మరోపక్క పర్యావరణవేత్తలు ఢిల్లీ లోని గాలి నాణ్యత ఆటగాళ్లకు మరియు ప్రేక్షకులకు ఆరోగ్య ప్రమాదాన్ని గురి చేయగలదని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు. ఏదేమైనా అంతా మంచి జరగాలని కోరుకుందాం.

Leave a Comment