ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో టాప్ బ్లాగ్స్ మరియు బ్లాగర్స్ వీరే!

బ్లాగింగ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది వున్నారు. కానీ దాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే వారు చాలా తక్కువ. ఈరోజు మనం, మన తెలుగు రాష్ట్రాల నుంచి బ్లాగ్స్ లేదా వెబ్సైట్ స్థాపించి దాని ద్వారా గుర్తింపు పొందుతూ మరోవైపుగా సంపాదిస్తున్న వారు గురించి తెలుసుకుందాం. బ్లాగింగ్ లేదా ఆన్లైన్ లో డబ్బు మరియు విజయం సాధిం చటం చాలా కష్టమైన పనే అని చెప్పుకోవాలి. అన్ని మెళుకువలు తెలిసినా, ఇక్కడ విజయం సాధించాలంటే కావాల్సింది ఓర్పు మరియు సహనం. కొంతమంది బ్లాగింగ్ ద్వారా తక్కువ సమయంలో డబ్బు సంపాదించటం మొదలు పెడితే మరికొందరికి మాత్రం ఎక్కువ సమయం పడుతుంది. దీనికి రకరకాల కారణాలు వుండొచ్చు. కానీ ఓర్పు మరియు సహనం లేకపోతే ఆన్లైన్ రంగం లో డబ్బు సంపాదించటం కష్టమే.

అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి బ్లాగింగ్ మొదలు పెట్టి విజయం సాదించిన వారి గురించి తెలుసుకుందాం. కాగా ఇక్కడ వారు ఎంత సంపాదిస్తారు అనేది ఊహించి చెప్తున్నదే తప్ప వారిని దీని గురించి సంప్రదించలేదు.

Course Dunia (Sai Ramesh): సాయి రమేష్ అనే గుంటూరు వ్యక్తి స్థాపించిన వెబ్సైటు ఈ కోర్స్ దునియా. కొత్తగా మొదలుపెట్టిన ఈ వెబ్సైట్ ద్వారా సాయి రమేష్ గారు అందరికీ ఉపయోగపడే కోర్స్ లను ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సాయి రమేష్ గారికి కోర్స్ దునియాతో పాటుగా చాలా రకాల బ్లాగ్స్ వున్నాయి. ఈ బ్లాగ్స్ ద్వారా తను నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్నారు. అంతే కాకుండా ఈయన చాలా మంది బ్లాగర్స్ కు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉచితంగా అందిస్తున్నారు.

Geek Dashboard (Amar): అమర్ అనే ప్రకాశం జిల్లా వ్యక్తి ఈ బ్ల్లాగ్ ని 2012 లో స్థాపించటం జరిగింది. గీక్ డాష్ బోర్డ్ అనే ఈ బ్లాగ్ ఎక్కువగా మొబైల్స్, కంప్యూటర్స్ కు సంబందించిన రివ్యూలను, వాటి పనితీరును మరియు టెక్నాలజీ సంబందించిన కొత్త విషయాలను పరిచయం చేస్తుంది. ప్రతి నెలా ఈ బ్లాగ్ ను తెలికించేవారి సంఖ్య 20,000 వరకు ఉంటుంది. మొబైల్స్, కంప్యూటర్స్ ని ఇష్టపడేవారు, ఈ గీక్ డాష్ బోర్డ్  కి ఒకసారి వచ్చినా ఖచిత్తంగా అభిమానిగా మారిపోతారు. ఈ బ్లాగ్ నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది అనేది ఒక అంచనా.

All Top 9 (Lasya): లాస్య అనే ఒక తిరుపతి అమ్మాయి స్థాపించిన ఈ బ్లాగ్ ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ కి సంబందించిన అంశాలను గురించి ప్రస్తావిస్తుంది. ఈ బ్లాగ్ 2013 లో బ్లాగ్ ని నెలకొల్పటం జరిగింది. సుమారుగా ఈ బ్లాగ్ కు నెలకి 15,000 వరకు వీక్షకులు రావటం చెరుగుతుంది. గూగుల్ ఆడ్స్ ద్వారా ఈ బ్లాగ్ నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది అనేది ఒక అంచనా.

All Tech Buzz (Imran Uddin)ఇమ్రాన్ అనే హైదరాబాద్ యువకుడు సస్థాపించిన ఈ బ్లాగ్ టెక్నాలజీ, గాడ్జెట్స్ కు సంబందించిన విషయాలను పొందుపరచటంలో ఇండియా లోనే టాప్ బ్లాగ్. ప్రతి నెలా ఈ బ్లాగ్ చూడటానికి వచ్చే వీక్షకుల సంఖ్య 30,000 నుంచి 50000 వరకు ఉంటుంది. ఈ బ్లాగ్ సుమారుగా నెలకి ఒక లక్ష వరకు సంపాదించడంలో అతిశయోక్తి లేదు.

Smart Telugu (Ravi Kiran)రవి కిరణ్ కోగంటి అనే వ్యక్తి స్థాపించిన ఈ స్మార్ట్ తెలుగు బ్లాగ్ ఇంగ్లీష్ లోనే కాక తెలుగులో కూడా అందుబాటులో వుంది. డిజిటల్ మార్కెటింగ్ కి సంబందించిన విషాయాలు ఈ బ్లాగ్ ద్వారా ఎక్కువుగా ప్రస్తావించటం జరుగుతుంది. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వారు స్మార్ట్ తెలుగు బ్లాగ్ ను సందర్శించండి.

ఇలాంటి బ్లాగ్స్ నిర్వహించే తెలుగు వారు గురించి మీకు తెలుసుంటే, క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

Leave a Comment