రామ్ గోపాల్ వర్మ తీసిన రియల్ లైఫ్ స్టోరీస్ లిస్ట్

రామ్ గోపాల్ వర్మ తీసిన రియల్ లైఫ్ స్టోరీస్: ప్రపంచంలో ఒక మనిషి యొక్క నిజ జీవిత సంఘటనల స్పూర్తితో ఎక్కువ సినిమాలు తీసింది ఎవరన్నా వున్నారు అంటే అది రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయన ఎంచుకున్న కథలు ఎక్కువగా నిజ జీవిత సంఘటనల మీదనే ఉంటాయి. వాటిని తన శైలిలో మలుచుకుని తీస్తుంటారు వర్మ. ముంబై అండర్ వరల్డ్ నుంచి గంథపు చక్కల స్మగ్లింగ్ వరకు, బాల్ థాకరే నుంచి ఎన్టీఆర్ వరకు, ఇలా అందరి జీవితాలలోని సంఘటనలు ఆధారంగా చాలా సినిమాలు తీశారు. అందులో దాదాపు అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి.rgv-films-inspired-from-real-life

ఒక రియల్ లైఫ్ స్టోరీ సినిమాగా తీయాలి అంటే ఈరోజుల్లో అది ఎంతో సాహసంతో కూడుకున్నపనే అని చెప్పాలి. పబ్లిక్ లోకి వచ్చి నేను పలానా వ్యక్తి మీద సినిమా తీస్తున్నాను అంటే, చాలా పరిణామాలు ఎదుర్కోవాలి. కానీ దేనిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకునే ఏకైక వ్యక్తి రాము. పైగా ఎవరినీ నొప్పించకుండా రియల్ లైఫ్ స్టోరీస్ మీద సినిమా తీయటం రామ్ గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యం. ఇది ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.

రామ్ గోపాల్ వర్మ తీసిన రియల్ లైఫ్ స్టోరీస్ లిస్ట్

 1. సత్య (1998): ఇది దావూద్ ఇబ్రహీం మరియు ముంబై అండర్ వరల్డ్ మీద తీసిన ఒక కల్పిత కథ
 2. కంపెనీ(2002): ఇది దావూద్ ఇబ్రహీం, చోట రాజన్ ల మధ్య జరిగిని సంఘటనలను ఆదారం చేసుకుని తీసిన సినిమా
 3. సర్కార్ (2005): అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కు బాల్ థాక్రే ప్రేరణ
 4. రక్త చరిత్ర (2010): పరిటాల రవి, మద్దెల చెరువు సూరి మధ్య జరిగిన సంఘటనల ఆదారం చేసుకుని తీసిన సినిమా
 5. నాట్ ఏ లవ్ స్టోరీ (2011): నీరజ్ గ్రోవర్ మర్డర్ ఆధారం చేసుకుని తీసిన సినిమా
 6. వంగవీటి (2016): వంగవీటి మోహన రంగ జీవితం ఆధారం చేసుకుని తీసిన తెలుగు సినిమా
 7. వీరప్పన్ (2016): వీరప్పన్  మరణించడానికి కారణమైన ఆపరేషన్ కకూన్ ఆధారంగా తీసిన సినిమా
 8. ఆఫీసర్ (2018): కె ఎం ప్రసన్న (ఐపీఎస్) జీవితంలో జరిగిన సంఘటనల ఆధారణగా చేసుకుని తీసిని సినిమా
 9. లక్ష్మీస్ ఎన్టీఆర్ (2019): ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తీసిన తెలుగు సినిమా
 10. మర్డర్ (2020): తెలంగాణలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రానున్న సినిమా
 11. పవర్ స్టార్ (2020): 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన క‌థ

Leave a Comment