పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ శివార్లలో వ్యవసాయం చేస్తారని అక్కడ తనకు ఒక చిన్న ఫాంహౌస్ ఉందని అందరికీ తెలిసిందే. అదే విదంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. పంజా సినిమా చూసినవారికి ఇది ఇట్టే అర్ధమవుతుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రంలో పెద్ద మొత్తంలో ఆవులను, కోడె దూడలను, గేదలను గమనించవచ్చు.

పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కార్తీక మాస వ్రతాన్ని పురస్కరించుకుని తన వ్యవసాయ క్షేత్రంలో జనసేన పార్టీ యొక్క వన రక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొక్కలు నాటి అందరూ అడవులను మరియు చెట్ల పెంపకాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అలాగే అక్కడ వున్న గోవులకు అరటిపండ్లు తినిపిస్తూ జంతువుల పట్ల తనకు వున్న అమితమైన ప్రేమను తెలియచేసారు. కాగా, వన రక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించటం గమనార్హం.