Life Of Ram Telugu Song Lyrics | Jaanu (2020) Movie
Movie Name | Jaanu (2020) |
---|---|
Song Name | The Life Of Ram/ Title Song |
Music Director | Govind Vasantha |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Singers | Pradeep Kumar |
Music Track Length | 3:38 |
Cast | Sharwanand, Samantha |
Director | C Prem Kumar |
Jaanu Telugu Movie Song “Life Of Ram” Lyrics | సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రదీప్, గోవింద్ వసంతా
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో.. అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ.. పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా.. నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ.. ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా, తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుత ఉన్నా
నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి…
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నను కనగా
అనగనగా, అంటూనే ఉంటా, ఎపుడూ పూర్తవనే అవక.. తుది లేని కథ నేను గా..
గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక కాలు నిలవదు యే చోటా… నిలకడ గా
యే చిరునామా లేక, యే బదులు పొందని లేఖ, ఎందుకు వేస్తోందో కేక.. మౌనం గా
నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లు గా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి..
లోలో…
ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం, నాకే సొంతం అంటున్నా..
విన్నారా..
నేనూ, నా నీడ, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న..
అందని ఆశల తో నిన్న..
ఎంతో ఊరిస్తూ ఉంది… జాబిల్లి
అంత దూరానున్నా.. వెన్నెల గా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది.. జోలాలి…
తానే నానే నానియే…తానే నానే నానియే …తానే నానే నానియే …తానే నానే నానియే …
You May Also Like To Visit: