How to Earn Money Online in Telugu (పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడం ఎలా) | Free Course

How to Earn Money Online in Telugu: Are you are searching on Internet to find various ways to earn money Online? then, you are at the right place. Telugu Ace is the only blog which provides genuine information about Online Money Making in Telugu & English. Here you can get the legitimate information on Online money making like Data Entry Works, Online Money Making Apps, Affiliate Marketing, Digital Marketing, Blogging, etc. Moreover, you can get the digital marketing course in Telugu which is absolutely for free of cost.

how-to-earn-money-online-telugu

How to Earn Money Online in Telugu (పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడం ఎలా) ?

మీరు ఇంట్లో నుండి ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే మీరు ఖచ్చితంగా ఈ పేజీ ని పూర్తిగా చదవాల్సిందే. పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడం ఎలా అనే విషయం పైన ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వటం జరిగింది. ఆసక్తి వున్న వారు పూర్తిగా చదవండి. ఇక్కడ తెలుపబడిన అన్ని మార్గాలు కేవలం ఆన్లైన్ ద్వారా చేయగలిగినవి మాత్రమే. కావున మీ దగ్గర కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉండవలెను. లేని వారు మీ దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్ ఉపయోగించగలరని ఆశిస్తున్నాను.

అసలు నిజంగా ఇంటర్నెట్ లో డబ్బు సంపాదించవచ్చా?

ఈ సందేహం మీకు రావటం సహజం. నిజం మాట్లాడుకుంటే ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించటం అనేది చాలా కష్టమైన పనే. కానీ కొన్ని మార్గాల ద్వారా అది సులభతరం అవుతుంది. వీటికి తోడు Online లో డబ్బు సంపాదించాలని అనుకునే వారికి కొన్ని అర్హతలు ఉండవలెను. అవి ఏమిటంటే కంప్యూటర్ పరిజ్ఞానం, వేగంగా నేర్చుకోగలగటం, ఓపిక. ఈ మూడు అర్హతలు వున్న వారు ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఏమిటో ఇక్కడ నుంచి కోర్స్ రూపంలో  తెలుసుకోవచ్చును.

Google Adsense

మీలో content create చేయగల సత్తా వుంటే మీరు చాలా easy గా డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ content అంటే కొత్తగా మరియు సొంతగా English లో వ్రాయగలగటం లేదా ఇన్ ఇంటర్నెట్ లో దొరికే software tools ఉపయోగించి video editing చేయగలగడం. 
ఇంగ్లీష్ లో సొంతగా వ్రాయటం వలన మీరు ఒక Website ని create చేసి దానికి Google Adsense ని అనుసంధానం చేయవచ్చు. Video Editing తెలిసిన వారు YouTube లో మంచి videos పెట్టి Adsense ద్వారా డబ్బు సంపాదించవచ్చును. ఈ రెండూ వేరు వేరు మార్గాలయినా డబ్బు మీకు వచ్చేది Google Adsense నుంచే. Website ఎలా create చేయాలి, YouTube channel ఎలా పెట్టాలి అనేది ఒక course రూపంలో త్వరలో TeluguAce నందు ఉచితముగా అందజేయబడును.
Content ఎక్కువ English లో create చేయలేని వారు లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇష్టపడని వారు క్రింద కనిపించే మార్గాల గురించి ఆలోచించండి.

Affiliate Marketing

Google Adsense తో పోల్చుకుంటే Online లో ఎక్కువ డబ్బులు సంపాదించగల ఏకైక మార్గమే Affiliate Marketing. ప్రత్యేకంగా దీనికి కావలసిన అర్హతలు అంటూ ఏమీ లేవు. మీకు ఒక పెద్ద friends circle వున్నా సరిపోతుంది. రాబోయే రోజుల్లో Affiliate Marketing ఇండియా లో ఒక సంచలనంగా మారనుంది. ఇది ఇప్పటి నుంచే అందిపుచ్చుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు. Amazon, Flipkart లాంటి E commerce వెబ్సైట్లు వాటి products ని Affiliate Marketing చేసే వారికి మంచి వేతనాలు ఇస్తున్నాయి. ఇవే కాక అనేక Insurance కంపెనీలు, Real Estate కంపెనీలు మరియు World Class కంపెనీలు అమ్మబడిన ప్రతి ఒక్క product కి కనీసం 10% ఆ product rate లో నుంచి అమ్మిపెట్టిన వారికి ఇస్తున్నాయి.
ఉదాహరణకు మీరు amazon లో లభించే 30,000 ఖరీదు చేసే ఒక laptop ని మీ  అమెజాన్ affiliate link ద్వారా ఎవరైనా కొనేలా చేస్తే మీకు 3000 రూపాయలు వరకు అమెజాన్ చెల్లిస్తుంది.

Freelancer

మీకు ప్రత్యేకమైన కళలు ఏమైనావున్నాయా? ఉదాహరణకు మీరు బాగా ఫోటోలు తీయగలరా, లేదా బాగా Web Designing చేయగలరా లేక Photoshop బాగా వచ్చినా, costume designing చేయగలిగినా మీరు Freelance Websites ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. మీకు వచ్చిన skills ఏవైతే ఉన్నాయో వాటిని freelancing websites లో నమోదు చేయాలి. అవసరం వున్న వారు మీతో పని చేయుంచుకుని అమెరికన్ డాలర్స్ లో డబ్బు చెల్లిస్తారు. ఇదంతా Online ద్వారానే జరుగుతుంది. Freelance Websites కి సంబంధించి అన్ని విషయాలు Telugu Ace లో త్వరలో లభించును.

Online Tutor Jobs

మీరు school లేదా college లో ఏదైనా subject లో మంచి పట్టు కనబరిచారా? అయితే మీరు Online Tutoring ద్వారా  నెలకు కనీసం INR 15,000 సంపాదించవచ్చును. Maths, Physics, Chemistry, Commerce మరియు ఇతర subjects మీద బాగా పట్టు వున్న వారికి మంచి అవకాశాలు వున్నాయి. దీనికి మీరు Online లో ముందుగా ఆ subject కి సంబందించిన exam qualify అవ్వవలసి ఉంటుంది.

Online Data Entry Jobs

చాలా వరకు Online Data Entry Jobs fake అనే చెప్పవచ్చు. Online Data Entry ద్వారా డబ్బు సంపాదించటం చాలా కష్టమైన పని. దీనికి చాలా రకాల కారణాలు వున్నాయి. భారత దేశ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు డేటా ఎంట్రీ వర్క్ ద్వారా ఆదాయం అందేలా ఒక website ని రూపొందించిందది. కానీ అది ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు. Website Link: https://digitizeindia.gov.in/ (ఈ website link ద్వారా మీ అదృష్టాన్ని పరీక్షించండి)
TeluguAce.com లో మీకు Online Data Entry Jobs లేదా Captcha jobs గురించి త్వరలో information ఇవ్వటం జరుగుతుంది.
ఇవే కాక Online లేదా Internet ద్వారా డబ్బు సంపాదించే చట్టబద్ధమైన మరియు నమ్మకమైన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ లభిస్తాయి. కనుక Telugu ACE website ని bookmark చేసుకోండి.

Leave a Comment