టాప్ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ కు గట్టి పోటీ ఇస్తున్న అల్లు అరవింద్… ఆహా!

తెలుగులో కొత్త సినిమాలు చూడాలంటే మొన్నటి వరకు అందరూ అమెజాన్ ప్రైమ్, Netflix, సన్ నెక్స్ట్ అనేవారు. కానీ అందరూ ఇప్పుడు తెలుగు కంటెంట్ కోసం ప్రత్యేకంగా వెలిసిన ఆహా అంటున్నారు. అల్లు అరవింద్ ప్రవేశపెట్టిన తెలుగు ప్రత్యేక డిజిటల్ ప్లాటుఫార్మ్ ఆహా. ఇందులో తెలుగు కంటెంట్ తప్ప వేరే భాషా సినిమాలు వుండవు. మొదటి నాలుగు నెలలు సదా సీదాగా నడిచినా, జూన్ నెల నుంచి ఆహా.. ఊపందుకుందనే చెప్పాలి. ప్రత్యేకంగా ఆహా కోసం చిత్రీకరించిన వెబ్ సిరీస్ చాలా అభిమానులను సంపాదించుకుంది. వినూత్న కథలతో తీసిన Locked, Mastis, Sin వంటి ఆహా ఒరిజినల్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

aha-competition-to-big-ott-platforms-in-july

అయితే సినిమాల పరంగా, టాప్ తెలుగు OTT లతో పోలిస్తే, ఆహా ఒక అడుగు వెనకే వుంది. ఆ లోటు తీర్చటానికి అల్లు అరవింద్ అండ్ టీం చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది. చిన్న సినిమాల మీద ఫోకస్ పెట్టి వాటిని డైరెక్ట్ గా రిలీజ్ చేసే ఆలోచనలో వుంది. ఇందులో భాగమే భానుమతి రామకృష్ణ  డైరెక్ట్ రిలీజ్. అలాగే తెలుగులో రిలీజ్ అవ్వని ఇతర భాషా సినిమాలను డైరెక్ట్ గా రిలీజ్ చేయనుంది. జులై నెలలో రెండు పరభాషా సినిమాలను తెలుగు దుబ్బింగ్ తో ఆహా లో రిలీజ్ చేయనున్నారు. అందులో ఒకటి, జీవ నటించిన తమిళ సినిమా Gypsy, మరొకటి మోహన్ లాల్ నటించిన మళయాళ Shylock. ఈ పరంగా చూస్తే వచ్చే నెలలో ఆహాదే… హవా…

ఇదిలావుంటే, అమెజాన్ ప్రైమ్, Netflix, సన్ నెక్స్ట్ లో జులై నెలలో తెలుగు సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన కృష్ణ అండ్ హిస్ లీల జూన్ 25న Netflix లోకి రానుంది. అలాగే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి ,అనుష్క నిశ్శబ్దం ఓటీటీలోకి వచ్చే అవకాశం వుంది.

Read: Aha Video Upcoming Telugu Movies 2020

Leave a Comment