భారతదేశంలో త్వరలో 5G సేవలు ఎప్పుడంటే!

అసలు మా ఊరిలోకి 3G సేవలే సరిగ్గా రావట్లేదు అప్పుడే ఈ 5G ఏంటని ఆశ్చర్యపోతున్నారా! మన కోసం ప్రపంచం ఆగదు కదా. మన సంగతి ఎలా వున్నా బయట దేశాలు మాత్రం ఎప్పుడో 5G ట్రయల్స్ ను మొదలుపెట్టి ఉపయోగించబోతున్నాయి కూడా. అయితే త్వరలో మన దేశానికి కూడా ఈ 5జి తాకిడి తగలనుంది. కొద్ది రోజులలో మన దేశ ప్రధాన నగరాలలో ఈ 5G సేవలను ఉపయోగించుకోవచ్చు. దానికి సంబదించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అసలు ఈ 5జి యొక్క సాధ్యా సాధ్యాలు ఏమిటో చూద్దాం.

5g-network-india

  1. ప్రస్తుత సమాచారం ప్రకారం మనకు అప్పుడప్పుడు వచ్చే 4జి కన్నా ఇది 50 రెట్లు వేగంతో నెట్ వర్క్ ను మన చేరువ చేస్తుంది. అంటే ఒక 1GB ఫైల్ ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే అది మనకు 30 సెకన్లలో అయిపోతుంది.
  2. 4G తో పోల్చుకుంటే సిగ్నల్ వ్యవస్థ మెరుగు పడుతుంది
  3. వీడియో కాలింగ్ ఇకపై తేలిక కానుంది
  4. వర్చ్యువల్ రియాలిటీ చేరువ కానుంది. కాబట్టి కొత్త ఆన్లైన్ గేమ్స్ మరియు యాప్స్ యొక్క డెవలప్మెంట్ కు పునాది పడుతుంది.
  5. సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపడనుంది. దీని ద్వారా గవర్నెన్స్ సులభం అవుతుంది
  6. భవిష్యత్తులో ప్రకృతి నుంచి వచ్చే అనర్థాలను ముందుగానే గమనించవచ్చు
  7. 4జి తో పోల్చుకుంటే సిగ్నల్ లాటెన్సీ 5జి లో చాలా తక్కువ. కాబట్టి సిగ్నల్ అనేది ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది మరియు డిస్ కనెక్షన్ ఫిర్యాదులు వుండవు.
  8. ఒకే సారి మీ స్మార్ట్ ఫోన్ లో 4 అప్లికేషన్స్ వరకు ఉపయోగించవచ్చు.
  9. అయితే, 5జి సేవలు ఇండియాలో అడుగుపెట్టాలంటే 2020 లో పునాది పడనుంది
  10. కొన్ని టెలికాం కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు వేళ కోట్లలో వుండగా, కొత్తగా రాబోతున్న ఈ 5జి స్పెక్ట్రమ్ ను ఎలా చేజిక్కించుకుంటారో చూడాలి.
  11. భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా పాటుగా నోకియా, ఎరిక్సన్ మరియు హువాయ్ కంపెనీలు 5 జి ట్రయల్స్‌లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా తదుపరి స్పెక్ట్రం వేలం మార్చి 2020 నాటికి జరగాల్సి ఉంది.

Leave a Comment